ఈవెంట్స్ బాట పట్టిన డీజే టిల్లు

ఈవెంట్స్ బాట పట్టిన డీజే టిల్లు. సిద్దు – నేహా శెట్టి జంటగా తెరకెక్కిన డీజే టిల్లు ఎంత పెద్ద విజయం సాధించిందో తెలియంది కాదు. ఇక ఈ సినిమా కు సీక్వెల్ రాబోతుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా..ఈ సినిమా తాలూకా స్టిల్స్ , వీడియోస్ ఇప్పటి నుండే విడుదల చేస్తూ సినిమా కు క్రేజ్ తెస్తున్నారు.

తాజాగా న్యూ ఇయర్ సందర్భాంగా సరికొత్త స్టిల్ ను రిలీజ్ చేసారు మేకర్స్. ఈ స్టిల్ లో వెల్ కమ్ టు టిల్లు ఈవెంట్స్ అంటూ సిద్దు హంగామా చేస్తున్నాడు. ఈ పోస్టర్ లో కలర్ ఫుల్ గా ఉన్నాడు. మొదటి పార్ట్ లో చిన్న ఫంక్షన్స్ కు డి జే కొట్టిన టిల్లు ఇప్పుడు ఈవెంట్స్ బాట పట్టాడు. ఇక ఈ సీక్వెల్ హీరోయిన్ ఎవర్ని ఖరారు చేస్తారో తెలియడం లేదు. ముందుగా అనుపమ ను అనుకున్నారు..సెట్స్ లో జాయిన్ అయినా తర్వాత ఆమె తప్పుకుంది. ఆ తర్వాత ఆమె ప్లేస్ లో ప్రేమమ్ బ్యూటీ మడోన్నా సెబాస్టియన్ ను అనుకున్నారు. కానీ ఆమె సెట్ కాదని వద్దనుకున్నారు. ప్రస్తుతం అయితే హీరోయిన్ వేటలో ఉన్నారు మేకర్స్.