నాగ్‌- వ్రవీణ్‌ సత్తారు కాంబోలో కొత్త చిత్రం

సికింద్రాబాద్‌ గణపతి ఆలయంలో పూజతో ప్రారంభం

Nag-praveen Sattaru's movie
Nag-praveen Sattaru’s movie

‘కింగ్’నాగార్జున హీరోగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి , నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లి పతాకాలపై నిర్మాతలు నారాయణదాస్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహనరావు, శరత్‌ మారార్‌ నిర్మిస్తున్న భారీ యాక్షన్‌చిత్రం తాజాగా మంగళవారం సికింద్రాబాద్‌ శ్రీ గణపతి ఆలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

తొలిసన్నివేశానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ క్లాప్‌ ఇచ్చారు.. సదానందగౌడ్‌ కెమెరా స్విచ్చాన్‌చేశారు.. ఈసందర్భంగా కింగ్‌ నాగార్జున మాట్లాడారు.. ఇవాళ గణపతి ఆలయంలో తన సినిమా ప్రారంభం కావటం సంతోషంగా ఉందన్నారు.

ఈ ఆలయానికి రావటం ఇదే తొలిసారి అన్నారు. టైటిల్‌ ఇంకా ఫైనల్‌ కాలేదని తెలిపారు.. యాక్షన్‌ బ్య్రాక్‌డ్రాప్‌ ఇలాంటి ఒక పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌లోనటించి చాలా రోజులైందన్నారు.. లండన్‌, ఊటీ, గోవా, హైదరాబాద్‌లో షూటింగ్‌ జరగనుందన్నారు..

దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు మాట్లాడుతూ, ఇదొక స్టైలిష్‌ యాక్షన్‌ చిత్రంగా రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఇతర నటీనటుల వివరాలనుత్వరలో వెల్లడిస్తామన్నారు..

ప్రముఖ నిర్మాత పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు మాట్లాడుతూ, హైదరాబాద్‌లో 10 రోజులపాటు షూటింగ్‌ జరిపి మార్చిలో గోవాలో 15రోజులు షూటింగ్‌ ప్లాన్‌చేశామన్నారు.. ఆ తర్వాత ఊటీ, లండన్‌ లో షూటింగ్‌ జరపున్నామని తెలిపారు. నాగార్జునగారికి కెరీర్‌లో వన్‌ ఆఫ్‌ది బెస్ట్‌ మూవీ అవుతుందన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/