సమంతతో విడాకుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నాగ చైతన్య

ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య , సమంతలు..కొంతకాలానికే విడాకులు తీసుకొని అందరికి షాక్ ఇచ్చారు. విడాకుల తర్వాత ఎవరి సినిమాలతో వారు బిజీ అయ్యారు. తాజాగా సమంతతో విడాకుల గురించి చైతు ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. తాజాగా నాగ చైతన్య – కృతి శెట్టి జంటగా వెంకట్ ప్రభు డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ కస్టడీ. తెలుగు, తమిళ భాషల్లో మే 12వ తేదీన విడుదల కాబోతుంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్లో పాల్గొన్న చైతు సినిమా విశేషాలు తెలియజేస్తూ సామ్ తో విడాకులఫై పలు కామెంట్స్ చేసారు.

మేము విడిపోయి రెండు సంవత్సరాలు అవుతోంది. అధికారికంగా విడాకులు తీసుకుని ఏడాదిదాటింది. కోర్టు కూడా మాకు విడాకులు మంజూరు చేసింది. ప్రస్తుతం మేము మా జీవితాల్లో ముందుకు సాగుతున్నాము. జీవితంలో ఎదురయ్యే ప్రతి దశను నేను గౌరవిస్తాను. సమంత మంచి మనసున్న వ్యక్తి. ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. సోషల్‌ మీడియాలో వచ్చిన వదంతుల వల్లే మా మధ్య పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి. ఒకరిపై ఒకరికి గౌరవం లేటన్లు ప్రజల్లోకి వెళ్లింది. నాకు బాధ కలిగించిన విషయం అదే’ అంటూ చెప్పుకొచ్చారు.

అలాగే తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తలపై కూడా నాగచైతన్య స్పందించారు. ‘ఈ మొత్తం వ్యవహారంలో మరో చెత్త విషయం ఏంటంటే.. నా గతంతో సంబంధం లేని వ్యక్తిని ఇందులోకి లాగి వార్తలు రాయడం. దీనివల్ల ఆ మూడో వ్యక్తిని అగౌరవపరిచినట్లు అయ్యింది. వ్యక్తిగత జీవితంపై ప్రశ్నించినప్పుడు మొదట్లో పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. మౌనంగా ఉండేవాడిని. ఇప్పటికీ నా పెళ్లి గురించే టాపిక్‌ తీసుకొస్తున్నారు. ఇలాంటి వదంతులు ఎందుకు సృష్టిస్తున్నారో..? నాకు అర్థం కావడం లేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.