బీసీసీ ఆఫీస్ లపై ఐటి దాడులు..కేటీఆర్ ఏమని ట్వీట్ చేసాడంటే..!

దేశంలో గత కొద్దీ నెలలుగా ఐటీ , ఈడీ దాడులు ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. రాజకీయ , బిజినెస్ , సినీ ఇలా ఎవర్ని కూడా వదలడం లేదు. ఇప్పటికే ఎన్నో ఆఫీస్ లపై, బిజినెస్ , రాజకీయ నేతల ఇళ్లలో దాడులు జరుగగా..మంగళవారం ముంబై, ఢిల్లీల్లో ఉన్న బీబీసీ కార్యాల‌యాల్లో ఐటీ అధికారులు సోదాలు చేసారు. ఇంట‌ర్నేష‌న‌ల్ ట్యాక్సేష‌న్‌, ట్రాన్స్‌ఫ‌ర్ ప్రైసింగ్‌లో అక్ర‌మాలు జ‌రిగిన‌ట్లు బీబీసీపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో బీబీసీపై ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని బీబీసీ ఆఫీసులో సుమారు 20 మంది అధికారులు సోదాల్లో పాల్గొన్నారు. ముంబైలో ఉన్న బీబీసీ స్టూడియోస్‌లో కూడా త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. డాక్యుమెంట్ల‌ను సీజ్ చేశారు. జ‌ర్న‌లిస్టుల ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల‌ను లాగేసుకున్నారు. స‌ర్వే కోసం ఆఫీసును సీల్ చేసిన‌ట్లు చెప్పారు. ఎటువంటి వివ‌రాల‌ను బ‌య‌ట‌కు వెల్ల‌డించ‌రాదు అని ఉద్యోగుల‌కు ఆదేశించారు.

దీనిపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ స్పందించారు. కొన్ని వారాల క్రిత‌మే ప్ర‌ధాని మోడీ ఫై బీబీసీలో డాక్యుమెంట‌రీ ప్ర‌సారం అయ్యింద‌ని, ఇప్పుడు భార‌త్‌లోని బీబీసీ ఆఫీసుల‌పై ఐటీ దాడులు జ‌రుగుతున్నాయ‌ని కేటీఆర్ అన్నారు. ఐటీ, సీబీఐ, ఈడీ లాంటి ఏజెన్సీలు న‌వ్వులపాలు అవుతున్నాయ‌ని, ఆ సంస్థ‌లు బీజేపీ కీలుబొమ్మ‌లుగా మారిన‌ట్లు కేటీఆర్ విమర్శించారు. కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రిని ప్ర‌శ్నించిన మంత్రి కేటీఆర్‌.. త‌ర్వాత ఎటువంటి చ‌ర్య‌ను తీసుకుంటార‌ని అడిగారు. అదానీ స్టాక్స్‌పై నివేదిక ఇచ్చిన హిండెన్‌బ‌ర్గ్ సంస్థ‌పై ఐటీ దాడి చేయిస్తారా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. లేదంటే ఆ సంస్థ‌నే టేకోవ‌ర్ చేసుకుంటారా అని ఆయ‌న విమ‌ర్శించారు.బీబీసీపై ఐటీ రెయిడ్స్‌కు సంబంధించి వివిధ మీడియా సంస్థ‌లు రాసిన క‌థ‌నాల‌ను త‌న ట్వీట్‌లో మంత్రి ట్యాగ్ చేశారు.