ఆయన మూడు తరాల ప్రేక్షకుల అభిమానాన్ని పొందారుః సిఎం కెసిఆర్‌

కైకాల సత్యనారాయణ మరణం చలనచిత్ర రంగానికి తీరని లోటు అని వ్యాఖ్య

kcr-pays-condolences-to-kaikala-satyanarayana

హైదరాబాద్‌ః సీనియన్ సినీ నటుడు కైకాల సత్యనారాయణ అనారోగ్య కారణాలతో 87 ఏళ్ల వయసులో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సంతాపాన్ని ప్రకటించారు. తెలుగు చలనచిత్ర రంగంలో తొలితరం నటుడిగా విభిన్న పాత్రలను పోషిస్తూ, తన వైవిధ్యమైన నటన ద్వారా మూడు తరాల ప్రేక్షకుల అభిమానాన్ని పొందారని కెసిఆర్ అన్నారు. సత్యనారాయణ మరణం తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటు అని విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/