శ్రీశైలం నల్లమల ఘాట్‌రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం

శ్రీశైలం నల్లమల ఘాట్‌రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సండ్రుగుండ ప్రాంతానికి చెందిన భక్తులు బస్సులో శ్రీశైలం దర్శనానికి వెళ్లారు. నల్లమల ఘాట్ రోడ్ లో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో ఇరవై మంది ప్రయాణికులు ఉన్నారని తెలిసింది. ఘాట్ రోడ్ లో ప్రయాణిస్తుండగా బస్సు అదుపుతప్పి బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

ఈ ప్రమాదంలో పదిమంది ప్రయాణికులకు గాయాలయ్యాయని, అందులో కొందరి చేతులు, కాళ్లు విరిగాయని తెలిపారు. ఇక ఘటన సమాచారం అందుకున్న పోలీసులు..క్షతగాత్రులను హుటాహుటిన సున్నిపెంట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.