కరీంనగర్ లో గణేష్ భక్తులకు వాటర్, లస్సీ, కూల్ డ్రింక్స్ పంపిణీ చేసిన ముస్లీం సోదరులు..

భారతీయులంతా ఒక్కటే..ఏ కుల , మతం బేధం లేదని నిరూపించారు ముస్లీం సోదరులు. హిందూ-ముస్లిం భాయి భాయి అనే నినాదంతో జమ్.. జమ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 2005 నుండి ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు తెలంగాణ హజ్ కమిటీ సభ్యులు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ తన స్వంత ఖర్చుతో హిందూ ముస్లిం సోదర భావాన్ని పెంపొందించేందుకు, మానవత్వపు పునాదిగా అద్భుతమైన సేవలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

బుధవారం గణేష్ నిమజ్జనం సందర్భంగా, నగరంలోని రాజీవ్ చౌక్ లో అతిపెద్ద స్టాల్ ను మంత్రి కమలాకర్ ప్రారంభించారు. బాదం మిల్క్ స్టాల్ ను సిపి సుబ్బారాయుడు, లస్సీ, బటర్ మిల్క్ స్టాల్ ను మేయర్ సునీల్ రావులు ప్రారంభించారు. రాజీవ్ చౌక్ లో ఏర్పాటు చేసి సుమారు 30వేల ఉచిత మినరల్ వాటర్ బాటిల్స్, గులాబ్ వాటర్, లస్సీ.. బట్టర్ మిల్క్, బాదాం మిల్క్ ను పంపిణీ చేస్తూ..దేశంలోనే గులాం అహ్మద్ ఆదర్శప్రాయుడన్నారు. గంగా జమున తెహజీబ్ కు కేరాఫ్ గా కరీంనగర్లో మాత్రం హిందూ-ముస్లిం అనే భేదభావం లేకుండా ఒక మంచి సాంప్రదాయాన్ని కొనసాగించే పద్ధతిలో భాగంగా మినరల్ వాటర్ ను, శీతల పానీయాలను గణేష్ నిమజ్ఞానికి వెళ్లే నగర హిందూ సోదరుల కోసం ప్రత్యేకంగా స్టాల్ ను ఏర్పాటు చేసి ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమని అంత కొనియాడుతున్నారు.