తెలంగాణలో వేర్వేరు జిల్లాల్లో రీపోలింగ్‌ ప్రారంభం

municipal elections
municipal elections

హైదరాబాద్‌: తెలంగాణలో నేడు వేర్వేరు జిల్లాల్లోని మూడు బూత్‌లలో రీపోలింగ్‌ ప్రారంభమైంది. ఈనెల 22న రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. టెండర్‌ ఓటు దాఖలు కావడంతో ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు రీ పోలింగ్‌కు ఆదేశాలు జారీ చేశారు. కామారెడ్డిలోని 41వ వార్డు 101వ పోలింగ్‌ బూత్‌లో రీపోలింగ్‌ నిర్వహిస్తున్నారు. దీంతో పాటు నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ 32వ వార్డు 87 పోలింగ్‌ బూత్‌లో ..మహబూబ్‌నగర్‌లోని 41వ వార్డులో 198వ పోలింగ్‌ సెంటర్లలో రీ పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. అధికారులు. సాయంత్రం 5గంటల వరకు ఈ పోలింగ్‌ జరగనుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/