ఈ ప్రభుత్వంలో ఆడపిల్లల భవిష్యత్‌కు గ్యారంటీ లేదు – బండి సంజయ్

Future of girl child is not guaranteed in this government – Bandi Sanjay

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫై బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. కాలేజీ లలో సీనియర్ల వేధింపుల కారణంగా మెడికల్ స్టూడెంట్ ప్రీతీ , ఇంజనీరింగ్ స్టూడెంట్ రక్షిత ఆత్మ హత్య చేసుకోవడం ఫై బండి సంజయ్ స్పందించారు. ఈ ఇద్దరు ఆడపిల్లలు ర్యాగింగ్‌కు బలికావడం తీవ్ర దిగ్బ్రాంతి కలిగిస్తోందని బండి సంజయ్ అన్నారు.

కేసీఆర్ పాలనలో ఆడపిల్లల భవిష్యత్‌కు గ్యారంటీ లేదన్నారు. కేసీఆర్ కుటుంబ – అవినీతి – నియంత పాలనలో సామాన్యులు బతకలేని దుస్థితి ఏర్పడిందని అన్నారు. ‘‘ప్రజాస్వామ్యవాదులారా…. మీ మౌనం సమాజానికే అరిష్టం… ఇకనైనా నోరు విప్పండి’’ అంటూ పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలనలో ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థులు కళ్లముందే చస్తున్నా స్పందించకపోవడం మానవత్వానికే కళంకమని మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూండా, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడాల్సిన అసవరం మనందరిపైనా ఉందని స్పష్టం చేశారు.