అగరాజ్యం అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది

అగరాజ్యం అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. ఓ సాయుధుడి తూటాలకు ఐదుగురు మృతి చెందిన ఘటన కెంటకీలోని లూయిస్‌విల్లేలోని ఓ బ్యాంకు వద్ద జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8.30 గంటల సమయంలో ఓల్డ్‌ నేషనల్‌ బ్యాంక్‌ మొదటి అంతస్థులోని సమావేశ మందిరంలో ఓ సాయుధుడు కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన వ్యక్తి పొడవాటి తుపాకీతో పాటు పలు ఆయుధాలు ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని మట్టుబెట్టారు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. ఓ పోలీస్‌ అధికారి సహా ఆరుగురు గాయపడ్డారు.

ఇక అమెరికా లో కాల్పులు జరపడం అనేది కొత్తమీ కాదు కానీ ఏప్రిల్‌ నెలలోనే కనీసం 15 ఘటనలు జరిగాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. లూయీస్‌విల్లే ఘటనతో సహా ఏడాది ఇప్పటి వరకు కనీసం 146 కాల్పులు చోటు చేసుకున్నాయి. ప్రపంచంలో మరెక్కడా లేనివిధంగా ప్రజలు ప్రతిరోజూ ఉదయం భయానక స్థితిలో మేల్కొంటున్నారని బ్రాడీ సెంటర్‌ ప్రెసిడెంట్‌ క్రిస్‌ బ్రౌన్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.