ఇళ్ల పై కూలిన విమానం.. ఇద్దరి మృతి
కాలిఫోర్నియాలో ప్రమాదం
Plane crashes into California homes, 2 dead
లాస్ ఏంజిల్స్: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ విమానం ఇళ్ల మీద కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇళ్లతో పాటు, అక్కడి డెలివరీ ట్రక్ సహా పలు వాహనాలు దగ్ధమయ్యాయి. శాన్ డియాగో శివారు ప్రాంతంలో ఉన్న సాంటీ నివాస గృహాలపై ఆ విమానం నేలకూలింది. ట్విన్ ఇంజిన్ సెస్నా 340 విమానం కూలినట్లు అధికారులు చెప్పారు. ఆరు సీట్లు ఉండే చిన్న ఎయిర్క్రాఫ్ట్ ఒకటి అరిజోనాలోని యుమా నుంచి బయలుదేరి, గంట తర్వాత కాలిఫోర్నియా చేరుకుంది. అదే సమయంలో ఒక్కసారిగా ఇళ్ల మీద కూప్పకూలింది.
ఈ ప్రమాదంలో విమానం పూర్తిగా కాలిపోయిందని అక్కడ అధికారులు చెప్పారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ప్రమాదం ఎందుకు జరిగిందన్న విషయంపై దర్యాప్తు చేపట్టారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/