‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ ట్రైలర్ అదుర్స్

సల్మాన్ ఖాన్ హీరోగా ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. 2014లో అజిత్ చేసిన ‘వీరమ్’ సినిమాకి రీమేక్ గా రూపొందింది. ఏప్రిల్ 21వ తేదీన ఈమూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. సల్మాన్ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి, ఫర్హాద్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ సినిమాలోని పలు సాంగ్స్ , ట్రైలర్ , టీజర్ సినిమా ఫై అంచనాలు పెంచగా..తాజాగా సినిమా తాలూకా ట్రైలర్ సోమవారం విడుదలై అదుర్స్ అనిపించింది.

ఈ మూవీ లో సల్మాన్ ఖాన్ ప్రధాన హీరోగా, బుట్టబొమ్మ పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ గా సందడి చేయనున్నారు. వీరిద్దరితోపాటు ఇందులో విక్టరీ వెంకటేష్, భూమిక కీలక పాత్ర పోషించునున్నారు. ఇందులో బిగ్ బాస్ బ్యూటి షెహనాజ్ గిల్ కూడా నటిస్తోంది. పూజా కు అన్నయ్యగా విక్టరీ వెంకటేష్ కనిపించనున్నారు. జగపతిబాబు విలన్‌గా నటించిన ఈ సినిమాలో షెహ్‌నాజ్ గిల్ కీలక పాత్ర పోషించారు.

ఇందులో సల్మాన్ ఖాన్ కు పేరు లేదని అందరూ తనను భాయ్ అని పిలుస్తారని చెప్పడం.. అలా పలకడానికి పూజా హెగ్డే ఇబ్బంది పడటం వంటి లవ్ సీన్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఇక వయలెన్స్ అంటే పడని సాధారణ వ్యక్తిగా వెంకటేష్ అలరించాడు. సీనియర్ హీరో జగపతి పవర్ ఫుల్ విలన్ గా మరోసారి తన మార్క్ చూపిస్తాడని ట్రైలర్ ద్వారా అర్థమైపోతుంది. యాక్షన్, లవ్, రొమాంటిక్, సెంటిమెంట్ వంటి సీన్లతో ట్రైలర్ ఆసక్తిగా ఉంది.

ఇక హింసకు దూరంగా ఉండే అన్నయ్య పాత్రలో వెంకటేష్ కనిపించారు. ఆయన్ని ఇబ్బంది పెట్టే విలన్‌ జగపతిబాబు. ఈ విలన్ నుంచి తాను ప్రేమించిన అమ్మాయి అన్నయ్యను కాపాడే పాత్రలో సల్మాన్ పవర్ ‌ఫుల్‌గా కనిపించనున్నారు. ఇది పక్కా కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా. సల్మాన్ స్టైల్ మాస్ డైలాగులు రేపు థియేటర్లలో ప్రేక్షకులతో ఈలలు వేయించనున్నాయి.

YouTube video