ప్రజల దృష్టిని మరల్చేందుకు కుట్ర

గుళ్లను కూల్చిన వ్యక్తి చంద్రబాబన్న విజయసాయి

అమరావతి: ఏపిలో మొదలైన పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు దొరకని స్థితిలో ఏం చేయాలో తెలియని చంద్రబాబు, ప్రజల దృష్టిని మళ్లించేందుకు తనదైన కుట్రలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆరోపించారు.

ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, ‘పంచాయతీ ఎన్నికలు పెట్టాల్సిందేనని రంకెలేసిన చంద్రబాబు ఇప్పుడు అభ్యర్థులు దొరక్క కళ్లు తేలేస్తున్నాడు. ఈ పరాభవం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు తన పార్టీ నాయకుల మీద తనే దాడులు చేయించే కుట్రలు మొదలుపెట్టాడు. గుళ్లను కూల్చినోడికి ఇంతకు మించిన ఆలోచనలెలా వస్తాయి?’ అని అన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/