రేషన్‌ పంపిణీ వాహనాలను పరిశీలించిన ఎస్‌ఈసీ

అమరావతి: ఏపిలో రేషన్‌ డెలివరీ వాహనాలను బుధవారం ఉదయం ఎస్‌ఈసీ రమేశ్‌ కుమార్‌ తనిఖీ చేశారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు విజయవాడ ఎస్‌ఈసీ కార్యాలయానికి ఈ వాహనాలను పౌర సరఫరాల శాఖ అధికారులు తీసుకొచ్చారు. పౌరసరఫరాల శాఖ రూపొందించిన నాణ్యమైన బియ్యం పంపిణీకి సంబంధించిన రెండు వాహనలను ఎస్‌ఈసీ పరిశీలించారు. ఈ సందర్భంగా పంపిణీ ఏ రకంగా జరుగుతుందో పౌరసరఫరాల‌శాఖ కమీషనర్ కోన శశిధర్ వివరించారు. పంపిణీ వాహనంలో ఎక్కి పరిశీలించిన నిమ్మగడ్డ… వాహనాలలో ఉన్న సదుపాయాలు, వినియోగాన్ని పరిశీలించారు. వాహనం డ్రైవర్ కేబిన్‌లో కూర్చుని రేషన్ పంపిణీ వివారాలను అధికారులను ఎస్‌ఈసీ నిమ్మగడ్డ అడిగి తెలుసుకున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/