వేణుగోపాలకృష్ణ ను జగన్ వెనుకేసుకొనివస్తే పార్టీ లో కొనసాగాను – పిల్లి సుభాష్

వైస్సార్సీపీ లో అంతర్గత విభేదాలు రోజు రోజుకు ఎక్కువై పోతున్నాయి. ప్రస్తుతం రామచంద్రపురం నియోజవర్గ వైస్సార్సీపీ టికెట్‌పై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మధ్య గత కొద్దీ రోజులుగా వార్ నడుస్తుంది. ఈ వార్ ఇప్పుడు పబ్లిక్ గా బయటపడుతుంది. తాజాగా ఆదివారం రామచంద్రపురం లో నిర్వహించిన మీడియా సమావేశంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ..వేణుగోపాలక్రిష్ణకు మళ్లీ టికెట్‌ ఇస్తే తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని , అవసరమైతే పార్టీ నుండి బయటకు వచ్చి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

కార్యకర్తలు, క్యాడర్‌ దగ్గర చెల్లుబోయిన వేణు ఎన్ని రోజులు నటిస్తారని ప్రశ్నించారు. తమను వేణు చెప్పు కింద బతికే వాళ్లం అనుకుంటున్నారా? అని అన్నారు. 2024 ఎన్నికల్లో వేణు పోటీలో ఉంటే తాను మద్దతిచ్చే పరిస్థితి లేదని తేల్చిచెప్పారు. మా కుటుంబం నుంచే ఒకరు పోటీ చేయాలని క్యాడర్ కోరుతున్నారని, తనకు క్యాడర్ ముఖ్యమని స్పష్టం చేశారు. తాను క్యాడర్‌ను వదులుకోవడానికి సిద్దం లేనని, ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతామన్నారు. వేణు ఆత్మీయ సమ్మేళనానికి తనకు ఆహ్వనం అందలేదని, దీనిపై సమయం వచ్చిప్పుడు క్యాడర్ సమాధానం చెబుతారని పిల్లి వ్యాఖ్యానించారు.