ప్రధాని మోడీని పెళ్లికి ఆహ్వానించిన ఎంపీ రమేష్‌

bjp-mp-cm-ramesh-meets-pm-modi
bjp-mp-cm-ramesh-meets-pm-modi

న్యూఢిల్లీ: బిజెపి పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ప్రధానిని కలిశారు. తన కుమారుడు రిత్విక్‌ వివాహ ఆహ్వాన పత్రికను సీఎం రమేష్‌ మోడీకి అందజేశారు. రాష్ట్రానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రాజా తాళ్లూరి కుమార్తె పూజతో రిత్విక్‌ నిశ్చితార్థం కొద్దిరోజుల కిందటే దుబా§్‌ులో నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా వచ్చే నెల ఫిబ్రవరి 7న రిత్విక్‌, పూజ వివాహం జరుగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ రావు, ఏపీ సీఎం జగన్‌, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులను పెళ్లికి ఆహ్వానించబోతున్నట్లు తెలుస్తోంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/