ఏపి స్పీకర్‌, మండలి చైర్మన్‌తో గవర్నర్‌ భేటీ

శాసన సభ, మండలిలో ఇటీవల పరిణామాలపై ఆరా

Biswabhusan Harichandan
Biswabhusan Harichandan

అమరావతి: ఏపిలో ప్రస్తుత రాజకీయాలు హాట్ గా ఉన్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసనమండలి చైర్మన్ షరీఫ్ తో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విడివిడిగా భేటీ అయ్యారు. రెండు బిల్లుల రద్దు వ్యవహారంపై శాసనసభ, మండలిలో ఇటీవల జరిగిన పరిణామాలపై గవర్నర్ ఆరా తీసినట్టు సమాచారం. అసెంబ్లీలో, కౌన్సిల్ లో జరిగిన పరిణామాల గురించి గవర్నర్ కు తమ్మినేని, షరీఫ్ లు వివరించినట్టు తెలుస్తోంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/