యూరోపియన్‌ యూనియన్‌లో సిఏఏకు వ్యతిరేకంగా తీర్మానం

European Union
European Union

బ్రస్సెల్స్: యూరోపియన్‌ యూనియన్‌ పార్లమెంట్‌ సిఏఏకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశ పెట్టింది. భారత్‌ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. యూరోపియన్‌ యూనియన్‌లోని 24 దేశాలకు చెందిన 154 మంది సభ్యులు ఈ తీర్మానాన్ని ఆమోదించారు. త్వరలోనే ఈ పౌరసత్వ సవరణ చట్టంపై సమగ్ర చర్చ జరపనున్నారు. అనంతరం దీనిపై జనవరి 30న ఓటింగ్‌ నిర్వహించనున్నారు. ఈ తీర్మానంలో ప్రధానంగా సిఏఏ, ఎన్‌ఆర్‌సి చట్టాల వల్ల ముస్లింలకు అన్యాయం జరుగుతుందని పేర్కొంది. అంతేకాకుండా ఈ చట్టం కారణంగా వారు తమ పౌరసత్వం కోల్పోయే ప్రమాదం ఉందని అందులో తెలిపింది. అంతర్జాతీయ సిద్ధాంతాలను, ఒప్పందాలను భారతదేశం ఉల్లఘించి జాతి, మతం, రంగు ఆధారంగా పౌరసత్వం ఇవ్వకూడదని యూరోపియన్‌ యూనియన్‌ స్పష్టం చేసింది. శాంతియుతంగా సిఏఏను వ్యతిరేకిస్తూ నిరసనలు చేస్తున్న వారిపై ప్రభుత్వం క్రిమినల్‌ కేసులు పెట్టడం దారుణమని యూనియన్‌ వాపోయింది. వారితో చర్చలు జరపాలని భారత ప్రభుత్వాన్ని యూరోపియన్‌ యూనియన్‌ కోరింది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports