రఘురాజుపై అనర్హత వేటు వేయాలని రెండేళ్లుగా కోరుతున్నాం : వైస్సార్సీపీ ఎంపీ

మోడీని బీజేపీ సభ్యులెవరైనా విమర్శిస్తే ఇలాగే ఉంటారా?

అమరావతి : వైస్సార్సీపీ ఎంపీగా కొనసాగుతూనే ఆ పార్టీపై, పార్టీ అధ్యక్షుడు జగన్ పై విమర్శలు గుప్పిస్తూ రఘురామకృష్ణరాజు ప్రతిరోజు వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజుపై వైస్సార్సీపీ మరో ఎంపీ మార్గాని భరత్ నిప్పులు చెరిగారు. ఓ వైపు పార్టీ అధినేతను దూషిస్తూనే… మరోవైపు తాను ప్రభుత్వాన్ని అంటున్నానని రఘురాజు అతితెలివి ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.

రఘురాజుపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ ను గత రెండేళ్లుగా తాము కోరుతున్నామని చెప్పారు. అనర్హత వేటుపై ఆలస్యం చేయవద్దని కోరినప్పటికీ ఇంత వరకు ఎలాంటి ప్రతిస్పందన లేదని అన్నారు. ప్రధాని మోడీ పై బీజేపీ చట్టసభ సభ్యులెవరైనా విమర్శలు చేస్తే ఇలాగే చూస్తూ ఊరుకుంటారా? అని ప్రశ్నించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/