టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పిన ఎంపీ కేశినేని నాని

టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఎంపీ కేశినేని నాని ప్రకటించడం ఇప్పుడు రాష్ట్రంలో , రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరో మూడు నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. గత ఎన్నికల్లో ఘోరఓటమి చవిచూసిన టీడీపీ పార్టీ ఈసారి జనసేనతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో నిల్చోబోతుంది. ఈసారి ఎలాగైనా గెలిచి జగన్ను గద్దదించాలని చంద్రబాబు చూస్తున్నారు. ఈ క్రమంలో బెజవాడ ఎంపీ కేశినేని నాని తన ఎంపీ పదవికి అలాగే టిడిపి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం ఇప్పుడు తెలుగు తమ్ములలో కలవరం పెడుతుంది.

2019 ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన అప్పటినుంచి కేశినేని నాని పార్టీపై పలు సందర్భాలలో తన అసంతృప్తిని బయటపెట్టాడు. గత కొద్దీ రోజులుగా ఆయనకు విజయవాడ ఎంపీ సీటు దక్కదని ప్రచారం ఊపందుకుంది. దానికి తగ్గట్టుగానే టిడిపిలో నానికి బదులు తన సోదరుడు చిన్నికి ప్రాధాన్యత ఇవ్వడం నాని తట్టుకోలేకపోయాడు. ఇక ఆదివారం తిరువూరులో చంద్రబాబు భారీ బహిరంగ సభ జరపనున్నారు. దానికి సంబంధించిన సన్నాహక సదస్సులో కేశినేని నాని ఫోటో లేకపోవడంతో నాని వర్గీయులు, చిన్ని వర్గీయుల మధ్య కొట్లాట జరిగింది. ఈ ఘటన లో బందోబస్తుకు వెళ్లిన పోలీసులకు సైతం దెబ్బలు తగిలాయి. దీనిపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. తన రాయబారి నారాయణ ను అక్కడికి పంపించి..నాని ని తిరువూరు సభకు దూరంగా ఉండమని చెప్పినట్టు నాని వెల్లడించారు. విజయవాడ ఎంపీ సీటు కూడా రాబోయే ఎన్నికల్లో తనకి ఇవ్వరని చెప్పినట్టుగా నాని తెలిపారు. గత కొంతకాలంగా పార్టీ ని నమ్ముకున్న తనను దూరం పెట్టడం..టికెట్ ఇవ్వడం లేదని చెప్పడం తో నాని..ఇక పార్టీ లో కొనసాగడం ఎందుకని..కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన ఎంపీ పదవికి అలాగే టిడిపి పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన ముందే దాని వర్గీయులు, అభిమానులతో చర్చలు జరిపి వారి అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాని చెప్పుకొచ్చారు. మరి చంద్రబాబు …నాని ని బుజ్జగిస్తాడా..? లేక వదిలేస్తాడా అనేది చూడాలి.