తమిళనాడు ఎంపీ గణేశమూర్తి గుండెపోటుతో మృతి

తమిళనాడు ఈరోడ్ ఎంపీ గణేశమూర్తి (77) గుండెపోటుతో మరణించారు. మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఆయనకు ఈ ఉదయం గుండెపోటు వచ్చింది. కొయంబత్తూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు.

ఎండిఎంకెకు చెందిన గణేష్ మూర్తి ఈరోడ్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. ఈసారి ఈరోడ్ నియోజకవర్గాన్ని డీఎంకే కైవసం చేసుకుంది. దీంతో గణేశమూర్తికి అవకాశం ఇవ్వలేదు. దీంతో డిప్రెషన్‌లో ఉన్నాడని అంటున్నారు. మార్చి 24 న లోక్‌సభ ఎన్నికలకు టికెట్ రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన గణేష్ మూర్తి తన ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కోయంబత్తూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్చారు కుటుంబసభ్యులు. కాగా, అతను చికిత్స పొందుతుండగా ఇవాళ ఉదయం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.