మాయిశ్చరైజ్‌తో మరింత అందం

More beauty with Maui Scharise

ప్రతిరోజూ శరీరం మొత్తాన్ని జెల్‌ లేదా ఆయిల్‌తో తప్పనిసరిగా మాయిశ్చరైజ్‌ చేసుకోవాలి. ముఖ్యంగా పొడిచర్మం కలవారు ఈ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ కనబరచకూడదు. డిటర్జంట్‌లు, ఎక్కువ గాఢత కల్గిన సబ్బులు వాడకుండా వీలైనంత వరకు సహజసిద్ధమైన వనరులతో తయారైనవి వాడితే మంచిది. అలాగే రాత్రి నిద్రపోయే ముందుకూడా క్రమం తప్పకుండా నైట్‌క్రీమ్‌తో ముఖం, శరీరం మొత్తం మాయిశ్చరైజ్‌ చేసుకోవాలి. కళ్ల చుట్టూ ఉండే చర్మాన్ని కూడా వదిలిపెట్టకూడదు. ఈ క్రమంలో చేతులు, పాదాల కోసం ప్రత్యేకమైన హ్యాండ్స్‌, నెయిల్‌ క్రీమ్‌ను వాడవచ్చు.

ఎక్కువసేపు స్నానం చేయడం మంచిది కాదు. ముఖ్యంగా వేడినీళ్ల స్నానమైతే మరింత కచ్చితంగా ఈ నియమం పాటించాలి. అలా షవర్ల కింద సమయం గడిపే సరదాకు కాస్త దూరం కావాలి. లేదంటే చర్మం మరింత పొడిబారిపోతుంది. స్నానం చేసే నీటిలో ఐదు చుక్కలు లావెండర్‌ ఆయిల్‌ను కలుపుకుంటే చాలా వరకు చర్మం పొడిబారకుండా చూస్తుంది.

ముఖానికి అయితే..: పసుపు, బాదం పేస్ట్‌, పాలమీగడతో తయారైన ఫేస్‌ ప్యాక్‌ను వాడితే ముఖచర్మం చక్కని మెరుపును సంతరించుకుని ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే బొప్పాయిపండు గుజ్జును ముఖం, చేతులు, పాదాలకు రాస్తే చర్మ సంరక్షణకు మంచిది. కళ్ల కింద చర్మాన్ని రోజూ కొబ్బరినూనెతో రెండునిమిషాల పాటు మసాజ్‌ చేస్తే కళ్లకింద నలుపు మటుమాయమవ్ఞతుంది. అంతేకాకుండా పెసరపిండి, పాలు, నిమ్మరసం, శనగపిండి, రోజ్‌వాటర్‌ తదితరాలతో క్రమం తప్పకుండా ప్యాక్‌లు పెట్టుకుంటే ముఖం తేటుగా, కోమలంగా ఉంటుంది. వారానికి ఒకసారి శరీరాన్ని బ్రష్‌తో బాగా రుద్దుకుని స్నానం చేయాలి. దీనివల్ల మృతకణాలు తొలగిపోయి, చర్మం తాజాగా ఉంటుంది.

పెదాలకుబి పగిలిపోవడం, పొరలుగా ఏర్పడటం వంటి సమస్యలు పెదాలకు రాకుండా ఉండేందుకు నిద్రపోయే ముందు లిప్‌క్రీమ్‌తో మసాజ్‌ చేసుకోవాలి. లిప్‌స్టిక్‌ వేసుకున్న తరువాత వేజలిన్‌ రాసినా పెదాల చర్మాన్ని అది సంరక్షిస్తుంది. పెదాలు పగిలి నల్లగా ఉంటే ఒక చుక్క గ్లిజరిన్‌ వేలుమీద వేసుకొని పెదాలపై మసాజ్‌ చేస్తుంటే క్రమేణా పగుళ్లు తగ్గి గులాబీలాగా మారతాయి. పెదాలు నల్లగా ఉంటే పడుకోబోయే ముందు కొత్తిమీరను పేస్ట్‌గా చేసి పెదాలపై మసాజ్‌ చేస్తే నలుపుదనం పోతుంది.

బయటకు వెళ్లడానికి అరగంట ముందే సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాసుకుంటే రోజంతా సూర్యుని ప్రతాపం నుంచి చర్మాన్ని రక్షించుకోవచ్చు. ఒక స్పూన్‌ రోజ్‌వాటర్‌లో రెండు చుక్కలు గ్లిజరిన్‌ కలిపి స్నానం చేసిన తర్వాత చేతులకు మర్దనా చేసుకుంటే నలుపుపోయి నున్నగా మారడమే కాకుండా మృదువ్ఞగా కూడా తయారవ్ఞతాయి.

శిరోజాలకు సంబంధించి అత్యధిక సమస్యలు తెచ్చిపెట్టే సమయం కూడా ఇదే. ఎక్కువగా కనిపించే సమస్య జుట్టు పొడిగా, నిర్జీవంగా ఉండటం, చిట్లిపో వటం. వీటినుంచి బయటపడటానికి ముం దుగా బాగా వేడిగా ఉన్న నీళ్లు స్నానానికి వాడకూడదు. ఎగ్‌ప్యాక్‌, హాట్‌ టవల్‌ ట్రీట్‌మెంట్‌లను ఉపయోగించుకోవచ్చు. గోరువెచ్చని నీళ్లతో స్నానం చేసినా ముగింపు మాత్రం చల్లటి నీళ్లతో చేస్తే జుట్టుకే కాదు, ఆరోగ్యానికీ ఎంతో మంచిది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/