ప్రజాస్వామ్యం కోసం పోరాడి నెగ్గిన వనిత

ఈ బృందాల సారథ్యంలో రాజకీయ సంక్షోభాన్ని చర్చల రూపంలో పరిష్కరించగలిగాం. దీనిలో నేను పరిశ్రమలు వాణిజ్య మండళ్ల సమాఖ్య, శాఖకు నేతృత్వం వహించా. పలు దఫాల చర్చల అనంతరం చివరకు అధ్యక్ష పాలనకు బదులు ప్రజాస్వామ్య పరిపాలనకు అంగీకారం కుదిరింది. ఇది చర్యల వల్ల సాధించిన విజయం. అందుకే 2015 సంవత్సరానికి గానూ ప్రతిష్టాత్మక నోబెల్‌ శాంతి బహుమతి
మా బృందాన్ని వరించింది.

Bouchmoi

అరబ్‌ దేశాలు అనగానే స్త్రీలు అత్యధికంగా వెనుకబడిన దేశాలని మనం అనుకుంటాం. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఆదేశాల్లో సైతం మహిళలు క్రీడలు, రాజకీయంగా, ఆర్థికంగా వృద్ధి చెందుతున్నారు. ప్రజాస్వామ్యానికి తావ్ఞలేకుండా నిరంకుశపాలనలో పాలకులు ఏది చెబితే అదే వేదం. ఇక మహిళలకు స్వేచ్ఛ ఎక్కడిది? కానీ రోజులు ఎప్పుడూ ఒకేలా వ్ఞండవ్ఞ కదా! చుట్టుపక్కల దేశాలు ప్రజాస్వామ్యంతో వర్ధిల్లుతుందే అరబ్‌ దేశాలు కూడా వాటికి ఆకర్షితులవ్ఞతున్నాయి. ఫలితంగా అరబ్‌ దేశాల్లో ప్రజాస్వామ్యం కోసం పోరాడుతు న్నాయి. ఇందులో ఒకదేశం ట్యునీషియా దేశం. పరిడవిల్లడానికి ఊపిరిపోసింది ట్యూనీషియా ఉద్యమం.

నిరంకుశ పాలనకు చరమగీతం పాడేందుకు యుద్ధం కంటే చర్చలే మేలని చాటి చెప్పేందుకు ఏర్పాటైంది నేషనల్‌ డైలాగ్‌ క్వార్టెట్‌. దానిలో ఓ బృందానికి వొయిడెడ్‌ బౌచ్‌మోయి నాయకురాలు. అడుగడుగునా అడ్డంకులు, ఆంక్షలు ఎదురైనా ఎదురొడ్డి నిలబడ్డారామె. ట్యునీషియాలో అధ్యక్ష ప్రభుత్వానికి చరమగీతం పాడి ప్రజాస్వామ్యం వికసించడంలో ఆమెది కీలకపాత్రే. అందుకే ఆ బృందానికి 2015లో నోబెల్‌ బహుమతి లభించింది. ఆమె తన అనుభవాలను ఇలా పంచుకున్నారు. మాది ట్యునీషయాలోని వ్యాపార కుటుంబం. మాదేశంలో అప్పటికే కొన్నేళ్ల పాటు కొనసాగిన నిరంకుశ పాలన వల్ల రోజురోజుకి పరిస్థితి దిగజారిపోతూ వచ్చింది. దాంతో లంచగొండితనం నిరంకుశత్వం సామాజిక అసమానతలు నిరుద్యోగం వంటి ఎన్నో సమస్యలు మనుషుల్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి.

ఇలాంటి సమయంలో ఉద్యమం తిరుగుబాటు ద్వారా ప్రజాస్వామ్యాన్ని సాధించలేమనే భావనలో ఉండేది. అందుకే చర్చల ద్వారా శాంతియుతంగా, సామరస్య పూర్వకంగా సాధించుకోవచ్చని నమ్మా. అలా చర్చల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చాం. అందుకోసమే ట్యునీషియా కార్మిక సంఘం, మానవహక్కుల సంఘం, పరిశ్రమలు, వాణిజ్యమండళ్ల సమాఖ్య, న్యాయవాదుల సంఘం కలిసి నేషనల్‌ డైలాగ్‌ క్వార్టెట్‌గా ఏర్పడ్డాం.

ఈ బృందాల సారథ్యంలో రాజకీయ సంక్షొభాన్ని చర్చల రూపంలో పరిష్కరించగలిగాం. దీనిలో నేను పరిశ్రమలు వాణిజ్య మండళ్ల సమాఖ్య, శాఖకు నేతృత్వం వహించా. పలు దఫాల చర్చల అనంతరం చివరకు అధ్యక్ష పాలనకు బదులు ప్రజాస్వా మ్య పరిపాలనకు అంగీకారం కుదిరింది. ఇది చర్యల వల్ల సాధించిన విజయం. అందుకే 2015 సంవత్సరానికి గానూ ప్రతిష్టాత్మక నొబెల్‌ శాంతి బహుమతి మా బృందాన్ని వరించింది.
అణగదొక్కే ప్రయత్నాలు: ఎన్నో ఆంక్షలు, అవమానాలు, దాడులూ, అణగదొక్కే ప్రయత్నాలను ఎదుర్కొన్నా. ఓ మహిళనై ఉండి జాతీయ స్థాయి చర్చల విషయంలో కీలకంగా వ్యవహరించడం కొందరికి నచ్చలేదు. రాజకీయ నేతలు నన్ను అడ్డుకునేందుకు మా వ్యాపారాలను దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. అయినా సరే ఎక్కడా వెనకడుగు వేయలేదు. అలాని వారితో గొడవాపడలేదు. కేవలం చర్చల ద్వారానే మార్పు తీసుకొచ్చే ప్రయత్నిం చేశా. నిజానికి ఇతర అరబ్‌ దేశాలతో పోలిస్తే మా దేశంలో మహిళల పరిస్థితి కాస్త మెరుగే.

మా దగ్గర స్త్రీ పురుషులకు సమాన హక్కులు ఉంటాయి. కాస్త చైతన్యం ఎక్కువే. ప్రపంచవ్యాప్తంగా మహిళల పరస్థితి గమనిస్తే వెనుకబాటుతనం స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కువ శాతం మంది మహిళలు గృహిణి తల్లి పాత్రలతో సరిపెట్టుకోవాలనుకుంటారు. వారిలో అంతర్గతంగా ఉండే శక్తిని గుర్తించగలిగితే అద్భుతాలు సృష్టించొచ్చు. ప్రపంచ దేశాలు తిరుగుతూ మహిళల్లో ఆ దిశగా చైతన్యం తెచ్చే ప్రయత్నం చేస్తున్నా. మతం అనేది ప్రతి ఒక్కరి మదిలో ఉంటుంది. ప్రపంచంలోని అన్ని మతాలు మంచినే చెబుతాయి. చెడు చేయమనిగాని, వేరొకరికి హాని చేయమని ఏ మతం చెప్పదు. అయితే కొందరు మాత్రం దీనికి తమ స్వార్థాన్ని జోడించి తప్పుదారి పట్టిస్తుంటారు అని ఆమె పేర్కొన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/