బరువు తగ్గండి ఇలా ..

హెల్త్ టిప్స్

Lose weight like this
Lose weight like this

కావాల్సిన పదార్ధాలు:

ఓట్స్ 4బై 4 కప్పులు, చియా సీడ్స్-1 టేబుల్ స్పూన్, వెన్న తీసిన పాలు – అర కప్పు, పెరుగు లేదా గ్రీక్ యోగర్ట్ -2 టేబుల్ స్పూన్లు, తేనె – 1 టేబుల్ స్పూన్, తురిమిన క్యారెట్ – అర కప్పు, దాల్చిన చెక్క పొడి – పావు కప్పు, ఎండు ద్రాక్ష- 1 టేబుల్ స్పూన్, వాల్ నట్స్ – 1 టేబుల్ స్పూన్.

తయారీ విధానం:

ఒక గ్లాసులో ఓట్స్, చియా సీడ్స్ వేయాలి, అందులో పాలు, పెరుగు, తేనె, దాల్చిన చెక్క పొడి వేసి , తురిమిన క్యారెట్ వేయాలి.. చివరిగా ఎండు ద్రాక్ష, వాల్ నట్స్ గార్నిష్ చేయాలి.. ఈ గ్లాస్ జార్ ను రాత్రంతా ఫ్రిడ్జ్ లో ఉంచితే ఉదయాన్నేహెల్దీ మరియు టేస్టీ బ్రేక్ ఫాస్ట్ రెడీ.. ఇందులోని దాల్చిన చెక్క బదులు చాకో చిప్స్ ను, ఎండు ద్రాక్ష, వాల్ నట్స్ బదులు బాదం , పిస్తా లకు క్యారెట్ కు బదులు అరటి పండును చేరిస్తే ఓవర్ నైట్ ఓట్స్ రెసిపీ సిద్ధం

ఓవర్ నైట్ ఓట్స్ ప్రత్యేకత

ఎన్నో పోషక విలువలతో పాటు ఓట్స్ ఫైబర్ లను అధికంగా కలిగి ఉంటుంది.. వీటిలోని ప్రోటీన్స్ శక్తిని, ఫైబర్లు మెటబాలిజం మెరుగు పరచటానికి సహాయ పడతాయి..

చియా సీడ్స్ లోని ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు అధిక బరువును తగ్గిస్తాయి.. పాలు ఎముకలను ధృడంగా ఉంచుతాయి..
పెరుగు శరీరానికి కావలసిన ప్రోటీన్లు , కాల్షియం అందించటంతో పాటు, జీర్ణ క్రియను మెరుగు పరుస్తాయి..

తేనె , ఐరన్, కాల్షియం , పొటాషియం, మెగ్నీషియం వంటి ఆవశ్యక ఖనిజాలను కలిగి ఉంటుంది..
బ్రేక్ ఫాస్ట్ లో మంచి పోషకాలను తీసుకోవటం వలన రోజంతా ఉత్సాహంగా ఉంటుంది.. ఇవి మాత్రమే కాకుండా సీసనల్ గా దొరికే పండ్లు, డ్రై ఫ్రూట్స్ ను ఇందులో చేర్చటం వలన అద్భుతమైన లాభాలు పొందవచ్చు..

మరిన్ని ఆరోగ్య సంబంధిత విషయాలు (నాడి) కోసం క్లిక్ చేయండి. : https://www.vaartha.com/specials/health1/