14 నుండి వర్షాకాల సమావేశాలు ప్రారంభం

Parliament of India
Parliament of India

న్యూఢిల్లీ: ఈనెల 14వ తేదీ నుంచి పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభంకానున్నాయి. అక్టోబ‌ర్ ఒక‌ట‌వ తేదీ వ‌ర‌కు స‌మావేశాల‌ను నిర్వహిస్తారు. సెప్టెంబ‌ర్ 14వ తేదీన ఉద‌యం 9 గంట‌ల‌కు దిగుబ స‌భ‌లో స‌మావేశం కావాల‌ని రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవిండ్ పిలుపునిచ్చిన‌ట్లు లోక్‌స‌భ సెక్ర‌టేరియేట్ త‌న‌ నోటిఫికేష‌న్‌లో పేర్కొన్న‌ది. అదే రోజున రాజ్య‌స‌భ కూడా మ‌రో స‌మ‌యంలో స‌మావేశం అవుతుంది. కాగా కరోనా నిబంధ‌న‌ల నేప‌థ్యంలో రెండు స‌భ‌ల‌కు చెందిన ఎంపీలు ఒక ద‌గ్గ‌ర కూర్చోబెట్ట‌డం ఇబ్బంది క‌రం కాబ‌ట్టి ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల‌ను సెప్టెంబ‌ర్ 14 నుంచి అక్టోబ‌ర్ ఒక‌టో తేదీ వ‌ర‌కు నిర్వ‌హించాల‌ని పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల క్యాబినెట్ క‌మిటీ సిఫార‌సు చేసిన విష‌యం తెలిసిందే.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/