ఏపీ సీఎం ను కలిసిన సమంత ప్రాణ స్నేహితురాలు

సమంత బెస్ట్ ఫ్రెండ్ ప్ర‌ముఖ ఫ్యాష‌న్ డిజైన‌ర్‌, మోడ‌ల్ శిల్పా రెడ్డి..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని కలిశారు. సీఎం క్యాంప్ ఆఫీసు లో ఈమె ముఖ్యమంత్రి ని క‌లిసిన‌ట్లు పేర్కొంది. ఇంస్టాగ్రామ్ లో ఆమె జగన్ దంపతులతో ఉన్న పిక్ షేర్ చేస్తూ “ఇంత ఆతిథ్యం, ​​ప్రేమ మరియు ఆప్యాయతతో నన్ను మీ ఇంటికి స్వాగతించినందుకు ధన్యవాదాలు భారతి, జగన్ గారూ… ఇలాంటి అందమైన జంటను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది” అంటూ రాసుకొచ్చింది.

ఈ పిక్ లో జగన్, ఆయన సతీమణి భారతితో పాటు శిల్పా రెడ్డి కన్పిస్తున్నారు. అయితే ఈ పోస్టులో ఆమె జగన్ ను ఎందుకు కలిసింది అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. దీంతో అదే ఇప్పుడు సస్పెన్స్ అయ్యింది. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అసలు శిల్పా జగన్ దంపతులను ఎందుకు కలిసింది ? దాని వెనుక కారణం ఏంటి..? అని అంత మాట్లాడుకుంటున్నారు.

అస‌లు ఈ శిల్పారెడ్డి ఎవ‌రు అనుకుంటున్నారా.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత బెస్ట్ ఫ్రెండ్‌, న‌టుడు స‌మీర్ రెడ్డికి సిస్ట‌ర్‌. ఇటీవ‌లే.. స‌మంత‌, శిల్పారెడ్డి… ఇద్ద‌రూ క‌లిసి… ఆధ్యాత్మిక ప‌ర్య‌ట‌న లో భాగంగా… ఛార్ ధామ్ యాత్ర‌ను పూర్తి చేసిన విష‌యం మ‌న అంద‌రికీ తెలిసిందే.