అసంతృప్త నేతలకు బండి సంజయ్ షాక్..

bandi-sanjay

మరో ఐదు , ఆరు నెలల్లో తెలంగాణ లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీ లు గెలుపు కోసం గట్టిగా ట్రై చేస్తున్నాయి. ఇప్పటికే రెండుసార్లు విజయం సాధించిన బిఆర్ఎస్ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ..కర్ణాటక విజయం తో ఫుల్ జోష్ లో ఉంది. తెలంగాణ లో కూడా విజయం సాధించాలని చూస్తుంది. ఇక బిజెపి సైతం కేసీఆర్ ను ఈసారి ఎలాగైనా ఓడించాలని ముందు నుండి గట్టిగానే ట్రై చేస్తుంది. ఆకర్ష్ పేరుతో ఇతర పార్టీల నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించి కేసీఆర్ ఫై యుద్ధం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే గత ఎన్నికల తరహాలో తప్పులు చేయకుండా ఈసారి ముందు నుండే బిజెపి జాగ్రత్త పడుతుంది. అభ్యర్థుల ఎంపికలోనూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ కీలకంగా అడుగులు వేస్తుంది. క్షేత్రస్థాయిలో పని చేయకుండా, లాబీయింగ్ చేసే నేతలకు టికెట్లు ఇవ్వకూడదని బిజెపి నిర్ణయించింది. ప్రతి నియోజకవర్గం వారీగా సర్వేలు చేస్తూ ఆ నియోజకవర్గ ఓటర్ల అభిప్రాయాన్ని తెలుసుకుంటూ, ఎవరికైతే మెజారిటీ ప్రజలమద్దతు లభిస్తుందో వారికే టిక్కెట్లు ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది.

బీజేపీ తరఫున ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంపై ఇప్పటికే బిజెపిలో చాలామంది నాయకులు ఇష్టానుసారం ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో, బిజెపిలో ఇటువంటివి నడవవని బండి సంజయ్ సుతిమెత్తగా హెచ్చరించారు. ఇదే సమయంలో టికెట్లు ఎవరికి ఇస్తాము అనే దానిపై క్లారిటీ కూడా ఇచ్చారు. ఎంత పెద్ద లీడర్ అయినా సరే సర్వే లో గెలిచిన వారికే టిక్కెట్లు ఇస్తామని ప్రకటించి షాక్ ఇచ్చారు.