మార్చిలో తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన

తెలంగాణ లో మరోసారి ప్రధాని మోడీ పర్యటించబోతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పలుమార్లు తెలంగాణ లో పర్యటించిన మోడీ..ఇప్పుడు మరోసారి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు. చర్లపల్లి కొత్త రైల్వే టెర్మినల్ను మార్చి తొలి వారంలో ప్రధాని మోడీ జాతికి అంకితం చేస్తారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.

హైదరాబాద్ నుంచి మరిన్ని వందేభారత్ రైళ్లు కావాలని అడిగామని.. త్వరలో అందుబాటులోకి వస్తాయన్నారు. ఇక రూ.715 కోట్లతో నిర్మిస్తున్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పనులు 2025 చివరి నాటికి పూర్తవుతాయని.. ఇక్కడ 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు, 2 ట్రావలేటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.