ఖమ్మం MP సీటు కోసం 12 మంది ఆశావహులు …

త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలు అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే..అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీ బిఆర్ఎస్ ఈ ఎన్నికలో గెలిచి తీరాలని కసిగా ఉన్నాయి.

ఇప్పటీకే బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికలకు సంబదించిన దిశా నిర్దేశం నేతలకు సూచించగా..కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించడం తో పెద్ద ఎత్తున నేతలు దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇక ఖమ్మం MP సీటుకు 12 మంది దరఖాస్తు చేసుకున్నారు. సోనియా లేదా ప్రియాంక ఇక్కడి నుంచి బరిలో దిగాలని లేదంటే తనకు ఆ సీటివ్వాలని మాజీ మంత్రి రేణుకా చౌదరి అంటున్నారు. వీహెచ్ సీటును ఆశిస్తున్నారు. తుమ్మల, భట్టి, పొంగులేటి కుటుంబ సభ్యులు సైతం రేసులో ఉన్నారు. రాయల నాగేశ్వరరావు, రాజేంద్రప్రసాద్, పోట్ల నాగేశ్వరరావు, నాగ సీతారాములు, మద్ది శ్రీనివాసరెడ్డి పోటీలో ఉన్నారు. మరి ఎవరు ఫైనల్ గా నిలుస్తారో చూడాలి.