వైస్సార్సీపీ మారడం ఫై మేకతోటి సుచరిత క్లారిటీ

ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో ఏపీలో పార్టీల నేతల జంపింగ్ లు మొదలయ్యాయి. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో అంచనాలు వేస్తూ నేతలు తమ రాజకీయ భవిష్యత్ చూసుకుంటున్నారు. గత ఎన్నికల్లో వైస్సార్సీపీ పార్టీ లోకి పెద్ద ఎత్తున ఇతర నేతలు వెళ్లగా..ఇప్పుడు ఆలా వెళ్లిన వారంతా తిరిగి సొంత గూటికి వచ్చేందుకు , లేదా జనసేన లో చేరేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మాజీ హోంమంత్రి, ప్రత్తిపాడు వైస్సార్సీపీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత సైతం పార్టీ మారుతుందనే ప్రచారం జరుగుతుండడం తో వాటిపై క్లారిటీ ఇచ్చింది.

గుంటూరు జిల్లా కాకుమానులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమెమాట్లాడుతూ.. తాము ఎప్పుడూ జగన్ తోనే ఉంటామని సుచరిత తెలిపారు. తాను చెప్పిన దానికి తన భర్త దయాసాగర్ కూడా కట్టుబడి ఉంటారని అన్నారు. ఒకవేళ తన భర్త పార్టీ మారతాను, నీవు కూడా నాతో రా అని పిలిస్తే… ఒక భార్యగా తాను కచ్చితంగా తన భర్త అడుగుజాడల్లోనే నడుస్తానని చెప్పారు.

తన భర్త ఒక పార్టీలో, తాను మరో పార్టీలో, తన పిల్లలు ఇంకో పార్టీలో ఉండమని తెలిపారు. తామంతా వైస్సార్సీపీ కుటుంబ సభ్యులమని తేల్చి చెప్పారు. జగన్ పార్టీలో తాము ఉండగలిగినంత కాలం ఉంటామని అన్నారు.