హైదరాబాద్లో NIA సోదాలు

హైదరాబాద్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోదాలు చేస్తోంది. సీనియర్ జర్నలిస్ట్, వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్.వేణుగోపాల్ ఇంట్లో ఉదయం నుండి అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వేణుగోపాల్.. ‘విరసం’ నేత వరవరరావు అల్లుడు కావడం గమనార్హం. ఎల్.బి.నగర్ లో ఉన్న రవి శర్మ ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న కారణంతో అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబదించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.