సెక్యూరిటీ సిబ్బంది తో ఫోటో షూట్ ఫై ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి క్లారిటీ

ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేరు మరోసారి మీడియా లో హైలైట్ అయ్యింది. ఆ మధ్య ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో రోహిత్ రెడ్డి పేరు జాతీయ స్థాయిలో మారుమోగగా..ఇప్పుడు సెక్యూరిటీ సిబ్బంది తో ఆయన చేసిన ఫోటో షూట్ ఆయన్ను విమర్శలపాలు చేసింది. ఎమ్మెల్యేల వివాదంతో ఆయనకు భద్రత పెంచింది ప్రభుత్వం. ఏకంగా ఆ భద్రతా సిబ్బందితోనే చేసిన రీల్స్ పై విమర్శలు వెల్లువెత్తాయి. రోహిత్ రెడ్డికి ఇరువైపులా పోలీసులు, గన్ మెన్లు నడిచి వస్తుంటే ఆయన రాజసంగా మధ్యలో నడుస్తు వస్తున్నట్లుగా షూట్ చేసారు. ప్రభుత్వ కల్పించిన సెక్యురిటీ సిబ్బందితో ఇలా రీల్స్ చేయటం ఏంటి అని నెటిజన్లు, ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి.

ఈ నేపథ్యంలో ఆ వీడియోపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ‘మోడీ లెక్క కావాలని వీడియో తీసుకోలేదు. క్యాజ్వల్‌గా నడుచుకుంటూ వస్తుంటే మొబైల్‌లోని స్నాప్చాట్‌లో అక్కడి స్నేహితులు తీశారు. ఎవరినో ఇబ్బంది పెట్టడానికి కాద’న్నారు. అలాగే ప్రభుత్వ సిబ్బందిని వీడియోల కోసం వాడుకునే రకం తాను కాదని, హోమం అయ్యాక పైనుంచి ఒక అదృశ్య స్పార్క్ వచ్చి మంటలు అంటుకున్నాయని, ఆ సమయంలో వేదపండితులు యగశాలలోనే ఉన్నారని, హోమం అంతా పూర్తి అయ్యాక మంటలు రావడం శుభపరిణామం అని పేర్నొన్నారు.