లిక్కర్ స్కామ్.. శరత్ చంద్రారెడ్డికి బెయిల్ మంజూరు

ఆయన విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన హైకోర్టు

bail-sanctioned-of-sarat-chandra-reddy-issued-by-delhi-high-court

న్యూఢిల్లీః ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీ కొంతకాలంగా జైల్లో ఉన్న నిందితుడు శరత్ చంద్రారెడ్డికి సోమవారం( మే8) ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.తన భార్యకు అనారోగ్యంగా ఉన్న నేపథ్యంలో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని ఢిల్లీ హైకోర్టును అభ్యర్ధించారు. శరత్ చంద్రారెడ్డి అభ్యర్ధనను ఢిల్లీ హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. శరత్ చంద్రారెడ్డికి బెయిల్ మంజూరు చేసింది.

2022 నవంబర్ 09 వ తేదీన శరత్ చంద్రారెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబులను విచారించిన ఈడీ అధికారులు వారిని ఒకే రోజున అరెస్ట్ చేశారు. విచారణకు సహకరించడం లేదని ఈడీ అధికారులు వీరిని అరెస్ట్ చేశారు. ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ సంస్థకు శరత్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు. ఈ సంస్థతో పాటు పలు సంస్థల్లో శరత్ చంద్రారెడ్డికి భాగస్వామ్యం ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారి పాత్రఉందని సీబీఐ అనుమానిస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో సీబీఐ, ఈడీ అధికారులు గత ఏడాదిలో పలుమార్లు సోదాలు నిర్వహించారు.