పిల్లల్ని ఎత్తుకెళ్లి వారేమో అనుకోని సాధువులను కర్రలతో కొట్టిన స్థానికులు

అనుమానం అనేది ఏ పనైనా చేయిస్తుంది..ఎంతకైనా తెగించేలా చేస్తుంది. తాజాగా మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో అదే జరిగింది. పిల్లల్ని ఎత్తుకెళ్లి వారేమో అనుకోని సాధువులను కర్రలతో కొట్టేలా చేసింది.

వివరాల్లోకి వెళ్తే..

ఉత్తరప్రదేశ్ కు చెందిన నలుగురు సాధువులు కర్ణాటకలోని బీజాపూర్కు వెళ్లి అక్కడి నుంచి పండరీపురానికి పయనమయ్యారు. దారిలో లవణ గ్రామంలో ఓ పిల్లవాడిని అడ్రస్ అడిగారు. దీంతో వారిపై అనుమానం వచ్చి స్థానికులు వాగ్వాదానికి దిగారు. నలుగురు సాధువులను పిల్లలను ఎత్తుకపోయే ముఠాగా అనుమానించి కర్రలతో దాడి చేశారు.

పోలీసులు ఘటనాస్థలికి చేసుకుని సాధువులను విచారించారు. ఈ విచారణలో వారు మథురలోని శ్రీ పంచనం జునా అఖాడాకు చెందినవారిగా గుర్తించారు. గ్రామస్థులు తప్పుగా అర్ధం చేసుకోవడంతో తమపై దాడికి పాల్పడ్డారని సాధువులు చెప్పారు. కాగా, ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. అయితే ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.