ఒకే వేదికపై జగన్ – పవన్ – చంద్రబాబు

వైస్సార్సీపీ అధినేత సీఎం జగన్ , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒకే వేదిక ఫై కనిపించబోతున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ రాజ్ భవన్ లో అట్ హోం ఏర్పాటు చేసారు. అన్ని పార్టీల అధినేతలకు ఆహ్వానం పంపారు. హైకోర్టు న్యాయమూర్తులతో పాటుగా ప్రభుత్వ అధికారులు.. ప్రముఖులు రాజ్ భవన్ లో జరిగే తేనేటి విందుకు హాజరు కానున్నారు.

ఈ విందు కు సీఎం జగన్ – భారతి దంపతులు హాజరు కానున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు..జనసేనాని పవన్ కు రాజ్ భవన్ నుంచి ఆహ్వానాలు అందాయి. గత ఏడాది చంద్రబాబు ఈ విందుకు హాజరు కాగా, పవన్ కళ్యాణ్ మాత్రం హాజరు కాలేదు. కానీ ఇప్పుడు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పవన్ విజయవాడ లోనే ఉన్నాడు. పార్టీ ఆఫీస్ రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న తరువా పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేసారు. సమావేశం అనంతరం రాజ్ భవన్ కు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. మరి ముగ్గురు నేతలు ఒకే చోట ఎదురైతే ఎలా ఉంటుందో..ఎలా పలకరించుకుంటారో చూడాలి. రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయని అర్ధం అవుతుంది. ఈ క్రమంలో జగన్ తో వీరు స్టేజ్ ని ఎలా పంచుకుంటారో చూడాలి.