ఎన్నికల ఫై నమ్మకం లేదంటూ జగన్ కీలక వ్యాఖ్యలు

ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న నమ్మకం లేదని ..అధికారులను ఇష్టం వచ్చినట్టు బదిలీ చేస్తున్నారని .. అమలులో ఉన్న పథకాలను ప్రజలకు అందకుండా చేస్తున్నారని ..ఇదంతా పేదలకు మంచి చేస్తున్న నన్ను లేకుండా చేయడానికేనని జగన్ విమర్శలు కురిపించారు. ఏపీలో ఎన్నికల ప్రచారానికి ముంగిపు పలికే సమయం దగ్గరకు వచ్చింది. దీంతో ఉన్న ఈ కొద్దీ సమయాన్ని గట్టిగా వాడుకోవాలని చూస్తుంది. నెల క్రితం వరకు సైలెంట్ గా ఉన్న కూటమి..ఆ తర్వాత ప్రచార జోరు పెంచింది. కేంద్ర సర్కార్ సైతం కూటమి లో భాగం కావడంతో అధికారులు , నిఘా వర్గాలు , ఎన్నికల అధికారులు ఇలా అంత ప్రభుత్వానికి షాకులు ఇస్తూ వస్తున్నారు. మొన్నటి వరకు జగన్ చెప్పిందే శాసనం అన్నట్లు అధికారులు వ్యహరించారు. కానీ ఇప్పుడు ఈసీ ఆదేశాలతో వరుసగా అధికారులు బదిలీ అవుతున్నారు. ఇదే విషయాన్నీ నేడు ఎన్నికల ప్రచారంలో జగన్ చెప్పకనే చెప్పాడు.

మచిలీపట్నం ప్రచార సభలో సీఎం జగన్‌ నిరాశావాదాన్ని వినిపించారు. కూటమి నేతలు తనపై కుట్రలు పన్నుతున్నారని సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న నమ్మకం లేదని ఆరోపించారు. అధికారులను ఇష్టం వచ్చినట్టు బదిలీ చేస్తున్నారని ఆక్రోశం వెలిబుచ్చారు. అమలులో ఉన్న పథకాలను ప్రజలకు అందకుండా చేస్తున్నారని ఆక్షేపించారు. ఇదంతా పేదలకు మంచి చేస్తున్న నన్ను లేకుండా చేయడానికేనని విమర్శించారు.

అంతకు ముందు, బాపట్ల జిల్లా రేపల్లెలో సీఎం వైఎస్ జగన్ సిద్దం సభ నిర్వహించారు. ఈ సభ కోసం బాపట్ల జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలను తరలించారు. కానీ, వారికి కనీస వసతులు ఏర్పాటు చేయాడంలో వైసీపీ నేతలు విఫలమయ్యారు. దీంతో సభలో తొక్కిసలాట ఏర్పడింది. ఈ నేపథ్యంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సభలో తొక్కిసలాట జరిగి, ఓ మహిళ కాలుకు గాయమైంది. నడవలేని పరిస్థితిలో ఉన్న ఆ మహిళను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎండ తీవ్రత తట్టుకో లేక ఇద్దరు వృద్దులు, ఇద్దరు యువకులు, ఓ మహిళా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.