యాసంగి సాగు విధానంపై సిఎం కెసిఆర్ సమీక్ష

హైదరాబాద్: సిఎం కెసిఆర్ వర్షా కాలంలో పంటల కొనుగోళ్లు, యాసంగిలో సాగు విధానంపై ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. యాసంగిలో ఏ పంట వేయాలి? ఏది వేయొద్దు? ఏ పంట వేస్తే లాభం? దేనితో నష్టం? తదితర అంశాలపై సిఎం సమీక్షించనున్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున మక్కలను దిగుమతి చేసుకుంటున్నదని, దీనివల్ల దేశంలో మక్కల కొనుగోలుపై ప్రభావం పడుతుందని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మక్కల సాగుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని, శనివారం నాటి సమావేశంలో ఈ అంశంపైనా విస్తృతంగా చర్చ జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు సంబంధిత అధికారులు హాజరయ్యారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/