వైస్సార్సీపీ ని వీడుతున్నట్లు వస్తున్న వార్తలపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి క్లారిటీ

వైస్సార్సీపీ ని వీడుతున్నట్లు వస్తున్న వార్తలపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు. సోమవారం సీఎం జగన్ అధ్యక్షతన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మీద సమీక్షా సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశానికి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తో సహా పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు గైర్హాజరు అయ్యారు. దీంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీ ని వీడబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరగడం మొదలైంది. ఈ క్రమంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు.

తాను రాజకీయాల్లో ఉంటే జగన్ తోనే ఉంటా..లేదంటే వ్యవసాయం చేసుకుంటా అని అన్నారు. పార్టీకి తనకు గ్యాప్ వచ్చిందన్న ప్రచారాన్ని పూర్తిగా ఖండిస్తున్నట్లు తెలిపారు. తనకు అనారోగ్యం కారణం వల్లే నిన్నటి సమీక్ష సమావేశానికి హాజరు కాలేకపోయానని అన్నారు. అయితే ఈ విషయం అధిష్టానం దృష్టికి తీసుకొచ్చానని..అయినా కానీ ఇలాంటి వార్తలు ఎలా వస్తున్నాయన్నారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదు. మా బాస్ జగన్. ఆయన ఏం చెబితే అదే ఫైనల్ అని అన్నారు.