కెనడా ప్రధాని ఢిల్లీలో ఉండగానే.. ఆ దేశంలో ఇండియన్​ ఎంబసీ మూసివేయాలని బెదిరింపు కాల్

48 గంటల్లో రెండో బెదిరింపు కాల్.. మీడియా వర్గాల సమాచారం

khalistan-group-warning-call-to-india

న్యూఢిల్లీః ఓవైపు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఢిల్లీలో ఉన్నారు.. అయినా కెనడాలోని ఖలిస్థానీ వేర్పాటువాదుల దుశ్చర్యలు ఆగడంలేదు. ఒట్టావాలోని భారత రాయబార కార్యాలయాన్ని మూసివేయాలని హెచ్చరికలు జారీ చేశారు. భారత రాయబారిని వెంటనే వెనక్కి పిలిపించుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని బెదిరించారు. ఈమేరకు కెనడా నుంచి మంగళవారం బెదిరింపు కాల్ వచ్చిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గడిచిన 48 గంటల్లో ఇలా బెదిరింపు కాల్ రావడం ఇది రెండోసారి అని పేర్కొన్నాయి. జీ20 సదస్సులో భాగంగా ట్రూడోతో భేటీ అయిన భారత ప్రధాని నరేంద్ర మోడీ.. ఆ దేశంలో ఖలిస్థానీ గ్రూపుల దుశ్చర్యలను ఖండించారు.