వరంగల్ జిల్లాలో 10th హిందీ పేపర్ లీక్

TSPSC పేపర్ మాత్రమే కాదు పదో తరగతి పేపర్లు సైతం లీక్ కు గురవుతున్నాయి. నిన్న తెలుగు పేపర్ లీక్ అవ్వగా..ఈరోజు హిందీ పేపర్ లీక్ అయ్యింది. నిన్న వికారాబాద్‌ జిల్లా తాండూరులో తెలుగు పేపర్ లీక్ అవ్వగా.. ఈరోజు వరంగల్‌ జిల్లాలో హిందీ పేపర్ లీక్ అయింది. హిందీ క్వశ్చన్ పేపర్‌ ఉదయం 9.30కే బయటకు వచ్చినట్లు వరంగల్ అధికారులు గుర్తించారు. పరీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికే హిందీ పేపర్ లీక్ అయినట్లు పేర్కొంటున్నారు. వరుస పేపర్ల లీక్ తో విద్యార్థులు, తల్లిదందడ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కలెక్టర్ సీరియస్ గా స్పందించినట్లు తెలిసింది. పేపర్ లీక్ కు సంబంధించి విచారణ చేయాలని ఆదేశించినట్లు సమాచారం.

నిన్న తెలుగు పేపర్ లీక్ ఘటన ఫై తాండూర్ ఎంఈఓ వెంకటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తాండూర్ పోలీసులు.. తెలుగు ప్రశ్నాపత్రం లీక్ ఘటనలో ఇన్విజిలేటర్లు బండ్యప్ప, సమ్మప్పలను A1, A2 నిందితులుగా చేర్చారు. తాండూర్ గవర్నమెంట్ స్కూల్లో 260 మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు అధికారులు తెలిపారు. విధుల్లో మొత్తం 12 మంది ఇన్విజిలేటర్లు ఉండగా.. రూమ్ నెంబర్ 5లో రిలీవర్‌గా ఉన్న బండ్యప్ప ఉన్నారని చెప్పారు.

ఈ రూమ్‌లో అబ్సెంట్ అయిన విద్యార్థి క్వశ్చన్ పేపర్‌ను ఫోటో తీసినట్లు గుర్తించారు. మరో స్కూల్‌లో ఫిజిక్స్ టీచర్‌గా పని చేస్తున్న సమ్మప్పకు వాట్సప్ ద్వారా పంపించారు. సమ్మప్ప నుంచి తెలుగు ప్రశ్నాపత్రం మరికొంత మందికి వెళ్లింది. వీరిద్దరిపై ఐపీసీ 409, మాల్ ప్రాక్టీస్ యాక్ట్ సెక్షన్ 5,10 కింద కేసులు నమోదు చేశారు.