బ్రో థియేటర్స్ వద్ద అకిరా సందడి

పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బ్రో మూవీ ఈరోజు వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అభిమానులు ఎలాగైతే కోరుకున్నారో అంతకు మించి సినిమా ఉండడం తో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మరోపక్క ఉదయం నుండి థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రముఖుల తాకిడి ఎక్కువగా ఉంది.

పవన్‌ తనయుడు అకీరానందన్‌ సైతం ‘బ్రో’ చిత్రాన్ని వీక్షించారు. హైదరాబాద్‌లోని సుదర్శన్‌ థియేటర్‌కు వచ్చిన అకీరా.. అభిమానులతో కలిసి సినిమా చూశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. పవన్‌కల్యాణ్‌ నటించిన ‘తమ్ముడు’, ‘జల్సా’, ‘భీమ్లానాయక్‌’ చిత్రాల్లోని కొన్ని పాటలను ఈ సినిమాలో రీ క్రియేట్‌ చేశారు. ఆ సీక్వెన్స్‌ని ఉద్దేశిస్తూ ఫ్యాన్స్‌ సోషల్‌మీడియాలో వరుస ట్వీట్‌ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత పవన్‌కల్యాణ్‌ని ఇలాంటి లుక్‌లో చూడటం ఆనందంగా ఉందంటూ కామెంట్స్‌ వేస్తున్నారు. అలాగే సినీ స్టార్స్ సైతం సినిమా చాల బాగుందంటూ ట్విట్టర్ వేదికగా తెలియజేస్తున్నారు.