ఏపీ ప్రభుత్వంపై మండిపడుతున్న గిరిజనులు

జగన్ సర్కార్ ఫై గిరిజనలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. బోయ, వాల్మీకులు, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రంలో బోయవాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చద్దంటూ ఏపీ గిరిజన సంఘం నేడు అల్లూరి జిల్లాలోని మన్యం బంద్ కు పిలుపునిచ్చింది. ఈ బంద్ కు ప్రతిపక్ష, వామపక్ష నేతలు నేతలు మద్దతిచ్చారు. దీంతో మన్యం జిల్లాలో ఆర్టీసీ బస్సులను ఎక్కడికక్కడ నిలిపేశారు. అలాగే దుకాణాలు, వ్యాపార సముదాయాలను స్వచ్చంధంగా మూసేశారు. గిరిజనులు చేపట్టిన ఈ బంద్ కు సీఐటీయూ మద్దతు ఇచ్చింది.

పాలకొండ మండలం సింగన్న వలస కూడలి వద్ద ఏపీ గిరిజన సంఘం అధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. నాన్ షెడ్యూల్ గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చాలంటూ , హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతులు రద్దు చేయాలని అని నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే మల్లన్నగుడ, సిరికొండ గిరిజనులు ధర్నాలో పాల్గొన్నారు. మరోవైపు మావోయిస్టు ఈ పరిణామాలపై లేఖ విడుదల చేశారు. ఈస్ట్ డివిజన్ కార్యదర్శి గణేష్ పేరుతో వచ్చిన ఈ లేఖలో ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించింది. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు అధికార పార్టీ చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపు నిచ్చింది. అసెంబ్లీలో తీర్మానాన్ని వ్యతిరేకించింనందుకు బాధ్యత వహించాలన ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 5 నుంచి 6 షెడ్యూల్లు, 1/70 కింద వచ్చిన హక్కుల పరిరక్షణకు కట్టుబడాలని పట్టుబడుతున్నారు. ఆదివాసీ సంఘాల బంద్ పిలుపుతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. మావోయిస్టు పార్టీ కదలికలపై నిఘా పెంచింది.