తెలుగు రాష్ట్రాల్లో మహిళలు , బాలికల మిస్సింగ్ వివరాలను తెలిపిన కేంద్రం

తెలుగు రాష్ట్రాల్లో గడిచిన మూడేళ్లలో 72,767 మంది అదృశ్యం అయినట్టు కేంద్రం తెలిపింది. రాజ్యసభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఏటా వేల సంఖ్యలో బాలికలు, మహిళలు అదృశ్యమవుతున్నారని హోంశాఖ తెలిపింది.

మూడేళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అదృశ్యం అయినా మహిళలు , బాలికల వివరాలు :

  • ఆంధ్రప్రదేశ్ :

2019లో 2,186 మంది బాలికలు, 6,252 మంది మహిళలు
2020లో 2,374 మంది బాలికలు, 7,057 మంది మహిళలు
2021లో 3,358 మంది బాలికలు… 8,969 మంది మహిళలు అదృశ్యం అయ్యారు.

ఈ మూడేళ్లలో మొత్తం 7,928 మంది బాలికలు, 22,278 మహిళలు అదృశ్యం అయ్యారు.

  • తెలంగాణ :

2019 లో 2,849 మంది బాలికలు, 10,744 మంది మహిళలు
2020లో 2,232 మంది బాలికలు, 10,917 మంది మహిళలు
2021 లో 2,994 మంది బాలికలు, 12,834 మంది మహిళలు అదృశ్యం అయ్యారు.

ఈ మూడేళ్లలో తెలంగాణలో 8,066 మంది బాలికలు, 34,495 మహిళలు అదృశ్యం అయ్యారని కేంద్రం వెల్లడించింది.

ఈ మధ్యనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్ర లో ఏపీలో బాలికలు , మహిళలు అదృశ్యం అవుతున్నారని , కేంద్రం నాకు ఆ విషయం తెలిపిందని చెపితే..అధికార పార్టీ వైస్సార్సీపీ పవన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించింది. మరి ఇప్పుడు కేంద్రమే పార్లమెట్ సాక్షిగా అదృశ్యమైన వారి వివరాలు తెలిపింది. మరి దీనికే వైస్సార్సీపీ నేతలు ఏమని సమాధానం చెపుతారని జనసేన శ్రేణులు ప్రశ్నిస్తున్నారు.