వర్షాల ఎఫెక్ట్ : టమాటా కేజీ రూ 170

టమాటా ధర మరోసారి భారీగా పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు నెలలుగా కేజీ టమాటా రూ. 120 నుండి రూ. 150 లు పలుకుతుండగా..ఇక ఇప్పుడు వర్షాల దెబ్బకు మరింత పెరిగింది. తాజాగా అన్నమయ్య జిల్లా మదనపల్లె లో టమోటా ల ధరలు భారీగా పెరిగాయి.

ఈరోజు మదనపల్లె మార్కెట్ లో ఒక కిలో నాణ్యమైన టమోటా ధర రూ.170 కు పలుకగా… ఇందులో ఏ గ్రేడ్ రూ. 140 నుండి 170 పలికింది. బి గ్రేడ్ రూ. 118 నుండి రూ. 138 పలికింది. నిన్నటి వరకు టమోటా కేజీ రూ. 140 ఉండగా ఒక్క రోజులో ఇంత స్థాయిలో పెరగడంతో ప్రజలు గుండెలు బాదుకుంటున్నారు. ప్రస్తుతం వర్షాలు భారీగా పడుతుండడం తో టమాటా పంట కు తీవ్ర నష్టం ఏర్పడింది. అందుకే టమాటా ధర మరింత పెరుగుతుందని మార్కెట్ దారులు చెపుతున్నారు.