ఢిల్లీ రోహిణి కోర్టులో పేలుడు

న్యూఢిల్లీ: ఢిల్లీలోని రోహిణి కోర్టులో గురువారం ఉదయం పేలుడు సంభవించింది. దీంతో కోర్టు పరిసరాలు ఒక్కసారిగా వణికిపోయాయి. అంతా పరుగులు పెట్టారు. ఏం జరిగిందో తెలియక హడలిపోయారు. వెంటనే రంగంలోకి దిగన పోలీసులు ల్యాప్‌టాప్ బ్యాటరీ పేలినట్లుగా నిర్ధారించారు. ఈ ఘటనలో ఎవరికి గాయాలు ఏమీ కాలేదని పోలీసులు తెలిపారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. ఈ ఉదయం 11 గంటల సమంయలో రోహిణి కోర్డు పరిసరాల్లో ఓ గదిలో ఈ పేలుడు జరిందని వెల్లడించారు. కోర్టు రూమ్ నంబర్ 102లో స్కూల్ బ్యాగ్‌లో ఉంచిన ల్యాప్‌టాప్ పేలింది. ఒక్కసారిగా పేలుడు శబ్ధం వినిపించిందని తెలిపారు. ల్యాప్‌టాప్ నేలపై పడి ఉన్న వీడియోలు, పోలీసు సిబ్బంది చుట్టూ తిరుగుతున్న వీడియోలు బయటకు వచ్చాయి. ల్యాప్‌టాప్ బ్యాటరీలో టెక్నికల్ సమస్యల వల్ల పేలుడు సంభవించిందిని ప్రాథమిక అంచనాకు వచ్చారు.

కేసు నమోదు చేసుకున్నట్లుగా తెలిపారు. ఘటన జరిగిన వెంటనే కోర్టు కార్యకలాపాలన్నీ నిలిపివేసి.. సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. ఫోరెన్సిక్, క్రైమ్ బృందాలు సంఘటన స్థలానికి చేరకున్నాయి. విచారణ మొదలు పట్టాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/