బ్రిటన్ రాజకుమారుడు ఫిలిప్‌కు అస్వస్థత

మరికొన్ని రోజులపాటు ఆసుపత్రిలోనే ఉంటారన్న బకింగ్‌హ్యామ్ ప్యాలెస్

లండన్‌: బ్రిటన్‌ రాజకుమారుడు ఫిలిస్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన లండన్‌లోని కింగ్‌ ఎడ్వర్డ్‌ ఆస్పత్రిలో మంగళవారం సాయంత్రం చేరి చిక్సిత తీసుకుంటున్నట్లు బకింగ్‌హీమ్‌ ప్యాలెస్‌ వెల్లడించింది. క్వీన్ ఎలిజబెత్2 భర్త అయిన ఫిలిప్ వయసు 99 సంవత్సరాలు. వైద్యుడి సలహా మేరకే ఆయన ఆసుపత్రిలో చేరినట్టు బకింగ్‌హ్యామ్ ప్యాలెస్ తెలిపింది. మరికొన్ని రోజులపాటు ఆయన ఆసుపత్రిలోనే ఉండి చికిత్స తీసుకుంటారని పేర్కొంది. బ్రిటన్‌లో కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో రాణి ఎలిజబెత్‌తో కలిసి వెస్ట్ లండన్‌లోని విండ్సర్ రాజభవనంలోనే ఫిలిప్ ఉంటున్నారు. కాగా, గత నెలలో రాజదంపతులు ఇద్దరూ కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/