బిపిన్ రావ‌త్ చేసిన విశిష్ట సేవలకు నా వందనాలు: గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై

బిపిన్ రావ‌త్ భౌతిక‌కాయానికి గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై నివాళి

ఊటీ: నేడు నీల‌గిరి జిల్లాలో ఉన్న మ‌ద్రాస్ రెజిమెంట్ సెంట‌ర్‌లో వీర‌సైనికుల భౌతిక‌కాయాల‌కు గార్డ్ ఆఫ్ హాన‌ర్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ డాక్ట‌ర్ త‌మిళ‌సై సౌంద‌ర‌రాజ‌న్ నివాళి అర్పించారు. సైనికవీరుల పార్దీవ‌దేహాల ముందు పుష్ప‌గుచ్చం ఉంచి శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు. గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై త‌న ట్విట్ట‌ర్‌లో సీడీఎస్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ మృతి ప‌ట్ల ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన ఆర్మీ సిబ్బంది కూడా ఆమె నివాళి అర్పించారు. జ‌న‌ర‌ల్ రావ‌త్ దేశానికి అత్యున్న‌త సేవ‌లు అందించార‌ని, బాధాత‌ప్త హృద‌యంతో అమ‌ర‌ కుటుంబాల‌కు నివాళి అర్పిస్తున్న‌ట్లు ఆ ట్వీట్‌లో ఆమె తెలిపారు.

కాగా, నీల‌గిరి కొండ‌ల్లో జ‌రిగిన హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో సీడీఎస్ చీఫ్ బిపిన్ రావ‌త్, ఆయ‌న స‌తీమ‌ణి మ‌ధులికా రావ‌త్‌తో పాటు మ‌రో 11 మంది మృతిచెందిన విష‌యం తెలిసిందే.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/