ఫ్లాయిడ్ ఘటన..కౌన్సిలర్ల కీలక నిర్ణయం
యూఎస్ లోని మిన్నెపోలీస్ నగరంలో పోలీసు వ్యవస్థను తిరిగి పునర్నిర్మిస్తాం ..కౌన్సిల్ ప్రెసిడెంట్

మినియాపోలిస్: అమెరికాలో తెల్లజాతి పోలీసు అధికారి జార్జ్ ఫ్లాయిడ్ మెడపై మోకాలిని అదిమిపెట్టడంతోనే అతను మరణించాడని తేలడంతో, లక్షలాదిమంది నిరసనలకు దిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన జరిగిన యూఎస్ లోని మిన్నెపోలీస్ స్థానిక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేసి, పునర్నిర్మించాలని సిటీ కౌన్సిలర్లు నిర్ణయించారు. ప్రజా భద్రతా విధానంలో కొత్త పోలీసింగ్ వ్యవస్థకు ఊపిరులూదాలని నిర్ణయించాం. మన సమాజాన్ని సురక్షితంగా ఉంచాలన్నదే మా అభిమతం. మొత్తం పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం. తిరిగి పునర్నిర్మిస్తాం అని కౌన్సిల్ ప్రెసిడెంట్ లీసా బెండర్ మీడియాకు తెలిపారు. సిటీ కౌన్సిల్ తీసుకున్న ఈ నిర్ణయం ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని కౌన్సిల్ మెంబర్ అలోండ్రా కానో తెలిపారు. వాస్తవానికి పోలీసు విభాగంలో సంస్కరణలు తేవాలంటే కుదరదని భావించిన తరువాతనే, ప్రస్తుత పోలీసింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని నిర్ణయించామని అన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/