ఓఆర్ఆర్ పై ట‌స్క‌ర్‌ బీభ‌త్సం..

హైదరాబాద్ ఓఆర్ఆర్ ఫై నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ప్రతి రోజు ఏదొక ప్రమాద వార్త వెలుగులోకి వస్తూనే ఉంటుంది. అతి వేగం , మద్యం మత్తు , నిర్లక్ష్యపు డ్రైవింగ్ , నిద్ర ..ఇలా పలు కారణాల కారణంగా ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ఈరోజు కూడా అలాగే జరిగింది. రాజేంద్రనగర్ ఔటర్ రింగు రోడ్డు పై ట‌స్క‌ర్‌ బీభత్సం సృష్టించింది. ఈ సంఘటనలో ఒకరు మృతి చెంద‌గా..ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

హిమాయత్ సాగర్ఎగ్జిట్‌17 వద్ద ఆగి ఉన్న ఓ కారును టస్కర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆ కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా… ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. హైదరాబాద్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ మీదుగా గోవా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. టస్కర్ డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇక దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రాజేంద్రనగర్ పోలీసులు.