డబ్ల్యూహెచ్‌ఓతో తెగదెంపులు..బ్రెజిల్‌ హెచ్చరిక

డబ్ల్యూహెచ్‌ఓ‌ రాజ‌కీయాలు చేస్తోందన్న జైర్ బోల్సెనారో

Jair Bolsonaro-who

బ్రసీలియా: ప్రపంచ ఆరోగ్య సంస్థ ‌(డబ్ల్యూహెచ్‌ఓ‌)తో సంబంధాలు తెంచుకుంటామని తాజాగా బ్రెజిల్ హెచ్చ‌రించింది. ఆ సంస్థ రాజ‌కీయాలు చేస్తోందని, నిష్ప‌క్ష‌పాతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేదని ఆ దేశ అధ్యక్షుడు జైర్ బోల్సెనారో మండిపడ్డారు. కాగా, 2019 నుంచి డబ్ల్యూహెచ్‌వోకు బ్రెజిల్‌ ఆర్థిక సాయం చేయ‌డం మానేసింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలో అత్యధికంగా ప్ర‌భావిత‌మైన‌ దేశాలలో బ్రెజిల్ ఒకటి. కాగా కరోనా వైరస్‌ గురించి ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ‌(డబ్ల్యూహెచ్‌ఓ‌) జాప్యం చేసిందంటూ పలు దేశాలు మండిపడుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆ సంస్థకు అమెరికా నిధులు ఆపేసిని విషయం తెలిసిందే.


తాజా కరోనా లాక్‌డౌన్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/corona-lock-down-updates/